బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘భారత రాజకీయాల్లో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ప్రజా సేవ కోసం, పేదల జీవితాలను మెరుగుపరచడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలి మరణానికి భారతదేశం దుఖిస్తోంది. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే గొప్ప రాజకీయవేత్త సుష్మా స్వరాజ్’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆమె కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన పేర్కొన్నారు.
#SushmaSwaraj #TV9TeluguLIVEUpdates #SushmaSwarajPassesAway

0 Comments